భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పూజలు

భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పూజలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఉత్తరవాహిని నదీతీర ప్రాంతంలో వెలసిన శ్రీ పాకలపాడు గురువుగారి ఆశ్రమంలో ఆదివారం పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. పూజలలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆశ్రమ కమిటీ అధ్యక్షుడు రమణ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు.