బోగస్ ఎన్నికలను బహిష్కరించండి: వెంకటేశ్వర్ రావు

HYD: మున్నూరుకాపు మహాసభ పేరుతో బోగస్ ఎన్నికలు నిర్వహించటం చట్ట విరుద్దమని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు అన్నారు. సోమవారం కాచిగూడలోని మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోగస్ పేరుతో రాష్ట్ర మహాసభ ఎన్నికలు పిల్లి శ్రీనివాస్ రావు నిర్వహించడం నియమావళికి విరుద్దమన్నారు.