దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే
BDK: మణుగూరు మండలం పినపాక నియోజకవర్గ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు BRS పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నేతలపై నిన్న డీఎస్పీ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీ కార్యాలయం, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.