VIDEO: దుండిగల్‌లో బోల్తా పడిన కెమికల్ ట్యాంకర్.!
MDCL: దుండిగల్ టోల్‌గేట్ ఎగ్జిట్ నంబర్ 5 వద్ద ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఏపీ నుంచి వస్తున్న కెమికల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. లోపల డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.