VIDEO: ఆస్తి పన్నుపై 50% వడ్డీ రాయితీ
విశాఖ నగర ప్రజలకు GVMC ఊరటనిచ్చింది. ఈనెల 31లోపు పెండింగ్ ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. నివాస, వాణిజ్య భవనాలు, ఖాళీ భూముల పన్నులకు ఇది వర్తిస్తుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు, సెలవుదినాల్లో కూడా కౌంటర్లు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.