ఆయన గెలుపు యువతకి స్ఫూర్తిదాయకం: మాజీ ఎమ్మెల్యే

ఆయన గెలుపు యువతకి స్ఫూర్తిదాయకం: మాజీ ఎమ్మెల్యే

SRPT: తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి గెలుపొందారు. తొలి దశ ఎన్నికల్లో హోరాహోరీ పోరులో విజయం సాధించిన ఆయన ప్రజాసేవపై ఆసక్తి, ఆరోగ్యంతో బరిలో నిలవడం యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ అభినందించారు. ఆయనను గెలిపించిన గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.