ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మడ వాగు
PLD: గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా దుర్గి మండలం ముటుకూరు గ్రామ శివారులో ప్రవహిస్తున్న మడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వాగు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మడ వాగు ప్రవాహం తీవ్రంగా ఉండటంతో, ముటుకూరు నుంచి పోలేపల్లి మీదుగా మాచర్ల వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.