కేసీఆర్ పుట్టిన రోజు.. ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

కేసీఆర్ పుట్టిన రోజు.. ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

MNCL: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు జన్నారం మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మాజీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.