పొన్నూరు లూధరన్ చర్చి వద్ద పోలీసుల మోహరింపు

గుంటూరు: పొన్నూరు పట్టణంలోని ఏఈఎల్సీ టౌన్ లూథరన్ చర్చి వద్ద ఆదివారం అర్బన్ పోలీసులు మోహరించారు. చర్చి పాస్టర్ బదిలీ విషయంలో ఏఈఎల్సీలోని రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా నిరోధించడానికి తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఆదేశాల మేరకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.