వాడపల్లి వెంకన్నను దర్శించిన తణుకు ఎమ్మెల్యే
కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.