గంటలోనే గమ్యానికి.. అంతలోనే ఘోరం

గంటలోనే గమ్యానికి.. అంతలోనే ఘోరం

VZM: డెంకాడ మండలం నాతవలస టోల్ గేట్ సమీపంలో లారీ అగ్నికి అహుతైన ఘటనలో డ్రైవర్ సజీవ దహనమైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖ వెళ్తున్న లారీ.. అక్కడే ఆగి ఉన్న మరో లారీను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదదాటికి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన బసుదేబ్ సికిధర్(45) కాపాడాలని ఆర్తనాదాలు పెట్టినా ఎవరూ దగ్గరకి వెళ్లలేకపోయారు.