ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

HYD: నగరంలో నిషేధిత గేమింగ్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈదాడిలో 8 మందిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి వద్ద నుంచి 18 మొబైల్స్, 3పాస్ బుక్‌లు, 13 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.