పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
KMR: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిజాంసాగర్ మండల వాసి శేఖర్‌కు కామారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది. 2023లో బాలికను మాయమాటలతో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సాక్ష్యాధారాలను బలంగా ప్రవేశపెట్టిన పోలీస్ అధికారులను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.