పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని కవ్వగుంట, వంగూరు, జగన్నాధపురం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య, వైద్య, ఒంటరి మహిళ తదితరులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.