'క్రీడల్లో రాణించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి'
ASR: క్రీడల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మండల డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే) దుమంతి సత్యనారాయణ అన్నారు. గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. శనివారం కొయ్యూరు మండలంలోని బాలరేవుల, పిడుగురాయి, నూకరాయితోట గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు.