బీభత్సం సృష్టించిన కుక్కలు
MHBD: పట్టణ శివారులో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. కొండపల్లి గోపాలరావునగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరగగా.. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కల బెడద తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.