వెలిగల్లు నీటితో రైతులను ఆదుకోవాలి: సీపీఐ

వెలిగల్లు నీటితో రైతులను ఆదుకోవాలి: సీపీఐ

అన్నమయ్య: గాలివీడు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి మాధవరం, గొట్టివీడు, గోరన్ చెరువు గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించాలని CPI(ML) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. బోర్లు వేసినా నీరు పడక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందే వరకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.