VIDEO: పిఠాపురంలో ప్రారంభమైన హ్యాపీ సండే
KKD: ప్రజల జీవన శైలిని మార్చేందుకు పిఠాపురం రైల్వే స్టేషన్ వెళ్ళే మార్గంలో హ్యాపీ సండే కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. చిన్నారులు భరతనాట్యం, యోగాసనాలతో అలరించారు. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.