VIDEO: 490 కుటుంబాలకు సోలార్ వెలుగులు..!
NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సోలార్ అందించింది. ఈ నేపథ్యంలో జుజ్జూరు గ్రామంలో సుమారు 490 కుటుంబాలకు ఇవాళ సోలార్ ప్యానల్స్ అందించారు. మండల వ్యాప్తంగా లబ్ధిదారులకు ఉచిత సోలార్ ఏర్పాటు చేస్తున్నట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.