విప్రో సర్కిల్లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు

విప్రో సర్కిల్లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు

HYD: ఐటీ కారిడార్‌లోని విప్రో జంక్షన్ వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. జంక్షన్ పక్కనున్న ఖాళీ భూమిలో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేసి, అందులో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి డిజైన్, అభివృద్ధి పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. విగ్రహావిష్కరణ తేదీని త్వరలో అధికారులు ప్రకటించనున్నారు.