పొగమంచుతో రాకపోకలకు అంతరాయం

పొగమంచుతో రాకపోకలకు అంతరాయం

SKLM: సోంపేట మండలంలో మంగళవారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. పాలవలస గ్రామ సమీపంలోని జాతీయరహదారి పై వాహనాలపై రాకపోకలు మందగించాయి, ఎదురుగా వెళ్తున్న వాహనాలు కనిపించక వాహనాల హెడ్లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ మంచు జీడీ, మామిడి పూతలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.