విద్యార్థికి 10 వేల చెక్కు అందజేత

KNR: జిల్లాలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చొప్పదండి JC ఎంపీసీలో 979 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం పొందిన టి. విష్ణువర్ధన్‌కు మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ పమేల సత్పతి రూ. 10 వేల ప్రోత్సాహక చెక్కును అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులు విష్ణువర్ధన్‌ను అభినందించారు.