సింహాచలం తోటల్లో చిరు వ్యాపారి ఆత్మహత్య

సింహాచలం తోటల్లో చిరు వ్యాపారి ఆత్మహత్య

విశాఖ: అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ చిరు వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అజయ్ అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.