గురువుల సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే
GDWL: ఉపాధ్యాయులు తమ బోధనతో ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనియాడారు. బుధవారం ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి పదవీ విరమణ మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.