రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

MLG: జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ చదువుతున్న శాంతకుమార్ ద్విచక్ర వాహనం పై వెళ్తూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శాంతకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.