సెంట్రల్ మెడికల్ స్టోర్‌లో కలెక్టర్ తనిఖీ

BDK: రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. స్టోర్‌లో నిల్వ ఉంచిన ఔషధాల లభ్యత, నాణ్యత, గడువు తేది, ఆసుపత్రులకు సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. రోగులకు అవసరమయ్యే ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.