అధికారులకు ఎన్నికల నియమావళ పై శిక్షణ
MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రిసైడింగ్ అధికారులు సిబ్బందికి జిల్లా అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మండలంలోని మేదరిపేటలోని ఫంక్షన్ హాల్లో వారికి ఎన్నికల నిర్వహణ, నియమావళిపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ 11న ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని సూచించారు.