గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు
NZB: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పీజీ ప్రథమ సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, పీజీ కోర్సుల సమన్వయకర్త వెంకటేశ్ గౌడ్ ఈరోజు తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఎంకాం, ఎంఏ, ఎంఎస్సీ, బీఎల్ఎసీ సహా మొత్తం 11 కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.