మోదీ స్టేడియంలో 'ఫైనల్'.. ఫ్యాన్స్‌లో టెన్షన్

మోదీ స్టేడియంలో 'ఫైనల్'.. ఫ్యాన్స్‌లో టెన్షన్

T20 WC ఫైనల్ అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరగనుండటం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే, ఇదే స్టేడియంలో భారత్ 2023 ODI WC ఫైనల్లో ఓడింది. అలాగే, ప్రస్తుత T20 WC S-8 దశలో కూడా సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. గత 30 ICC మ్యాచ్‌ల్లో భారత్ ఓడిన 2 మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో కావడం గమనార్హం. మొత్తంగా ఈ స్టేడియంలో 10 మ్యాచ్‌లు ఆడితే.. 7W, 3L.