ఫెర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే
ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా స్థాపించిన డా. చంద్రికాస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రారంభించారు. ఫెర్టిలిటీ సెంటర్ సభ్యులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.