'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'
కోనసీమ: తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఆలమూరు మండలం చెముడు లంక గ్రామంలో తుఫాను కారణంగా నేలకొరిగిన అరటి తోటలను, వాలిపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు. రైతులకు కలిగిన నష్టం వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.