ఉగాది వేళ.. వేయిస్తంభాల గుడిలో దివ్య పూజలు
HNK: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధాన దేవతలకు పవిత్ర జలాలతో అభిషేకం, పంచామృత స్నానం చేస్తారు. ఉగాది సందర్భంగా అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించి కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇందులో ఈ సంవత్సరంలో గ్రహస్థితులు, శుభాశుభ ఫలితాలు వివరించబడతాయి. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా ఇస్తారు.