VIDEO: తంగళ్ళపల్లిలో ధర్నాకు దిగిన రైతులు
SRCL: తంగళ్ళపల్లి మండలం రామచంద్రపూర్ రైతులు శుక్రవారం రైల్వే పనులను అడ్డగించారు. రైల్వే అధికారులు పని సక్రమంగా చేయించకపోవడంతో బానప్ప చెరువు కట్ట తెగి తమ పంట పొలాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు రైల్వే అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. తమ పొలాలు మొత్తం నీటితో నిండిపోయి పాడైపోయాయని వాటికి నష్టపరిహారం ఎవరిస్తారన్నారు.