మూడు నెలలకోసారి జాబ్ మేళా: కలెక్టర్

మూడు నెలలకోసారి జాబ్ మేళా:  కలెక్టర్

TPT: గూడూరు దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరై మెళాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రతి మూడు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.