'పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే'లో ఎస్పీ
GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన 'పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే'లో శుక్రవారం పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను ఆయనకు సమర్పించారు. వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.