'రైతన్న మీకోసం' పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

'రైతన్న మీకోసం' పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

W.G: ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే 'రైతన్న మీకోసం' వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.