నేడు 29 షీప్ సొసైటీలకు ఎన్నికలు

నేడు 29 షీప్ సొసైటీలకు ఎన్నికలు

ATP: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు (షీప్ సొసైటీస్) సంబంధించి నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 29 సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పశు సంవర్థకశాఖ అధికారులు దీనికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మొదటి విడతలో 13 సొసైటీలకు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. నేడు అలా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.