'స్వర్ణాంధ్ర కోసం సమాజ భాగస్వామ్యం అవసరం'
ELR: పెదవేగి మండలం దుగ్గిరాలలో శుక్రవారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించిన రోజే స్వర్ణాంధ్రను సాధించగలమని పేర్కొన్నారు. అనంతరం దెందులూరు, చాటపర్రు గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.