‘ప్రజా పాలన' లో భాగంగా మెగా వైద్య శిబిరం
NLG: తెలంగాణ ప్రభుత్వ “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ మనోహర్ రావు, సర్పంచ్ గోదా రమాదేవి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. నిపుణులైన వైద్యులు గ్రామస్థులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.