దళితులతో రామాలయ నిర్మాణం

దళితులతో రామాలయ నిర్మాణం

బాపట్ల జిల్లా: చీరాల దళితవాడలో రామాలయ నిర్మాణం చేపట్టనున్నారు. దళితులను అర్చకులుగా నియమిస్తూ ఆలయ నిర్వహణ చేయాలని రోటరీ భవన్‌లో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆశయాల సాధనలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో శ్యాంప్రసాద్ జి, సునీల్ ఇస్కా, హేమంత్ కుమార్ పాల్గొన్నారు.