ఈ నెల 30లోపు ఈకేవైసీ చేయించుకోండి

ATP: రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ నెల 30 లోపు ఈకేవైసీ చేయించుకోవాలని సీఎస్డీటీ సూర్యనారాయణ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇంతవరకు 20 శాతం మంది ఈకేవైసీ చేయించుకోలేదన్నారు. వారంతా ప్రభుత్వం ఇచ్చిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్నారు.