రేపు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

రేపు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తప్పక హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.