అంగన్వాడి కేంద్రానికి కుర్చీలు,ప్లేట్లు అందజేత
NGKL: కల్వకుర్తిలోని ఇందిరా నగర్ కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుర్చీలు,ప్లేట్లు మంగళవారం దజేశారు. చిన్నారులు కూర్చోవడానికి సౌకర్యంగా ఉండేందుకు కుర్చీలతో పాటు, వారి భోజనానికి ఉపయోగపడే ప్లేట్లను అందజేశారు. అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యపై వారికి శ్రద్ధ పెరుగుతుందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.