మురుగు కోడులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు
ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు వద్ద తోకలపల్లి మురుగు కోడులో గుర్రపు డెక్కలు, తూడులు పేరుకుపోయింది. దీని వలన పంట పొలాలకు వెళ్లే సాగునీరు ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు మురుగు కోడులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, తూడులు తొలగించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.