జోరుగా ఎన్నికల ప్రచారం
JN: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 110 సర్పంచ్ స్థానాలు ఉండగా, అందులో 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 100 పంచాయతీలకు 340 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1,024 వార్డు స్థానాల్లో 228 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 796 వార్డు స్థానాలకు 1,893 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.