గద్దర్ అవార్డ్స్ వేడుకకు కొమటిరెడ్డి గైర్హాజరు!
TG: హైదరాబాద్ హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అయితే, సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వేడుకకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.