రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
ADB: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. KNR ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ SP శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు 9 మందితో కూడిన బృందం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. దస్త్రాలను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలో తనిఖీలో ఎలాంటి అనుమానం కలిగించే దస్త్రాలు లభించలేదని అధికారులు పేర్కొన్నారు.