VIDEO: శిథిలావస్థలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

VIDEO: శిథిలావస్థలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

MDK: రేగోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పులో నీరు చేరి పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు ఎప్పుడూ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆసుపత్రి భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.