VIDEO: దొంగ స్వాములకు దేహశుద్ది చేసిన గ్రామస్తులు

యాదాద్రి: మోత్కూరు మండలం పనకబండ గ్రామంలో ఆంజనేయస్వామి భక్తులమని చెప్పుకుంటూ బొట్టు పెట్టి ప్రజలను మోసగించిన దొంగ స్వాములు గ్రామస్తులకు పట్టుబడ్డారు. స్టేషన్ ఘనపూర్‌కు చెందిన కళ్లెం విజయ్, జీవన్ లాల్, కృష్ణలు పిల్లలు లేని దంపతులకు ప్రత్యేక పూజల పేరుతో వేల రూపాయలు వసూలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు అనుమానంతో పట్టుకుని పంచాయతీ భవనంలో బంధించారు.