అధ్వాన స్థితిలో మురికి కాలువలు

అధ్వాన స్థితిలో మురికి కాలువలు

శ్రీకాకుళం కత్తెర వీధిలో మురికి కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాలువలు పూర్తిగా శిథిలమవటంతో పారిశుద్ధ్య సిబ్బంది వాటిని పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. చెత్తాచెదారంతో కాలువలు నిండి మురుగునీరు ఎక్కడికక్కడే నిలువ ఉండిపోతోంది. దీనివల్ల దుర్గంధం, దోమల బాధ అధికంగా ఉంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.